Wednesday, January 22, 2025

ట్యాంక్‌బండ్ వద్ద పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ట్యాంక్ బండ్ , నెక్లెస్ రోడ్, ఐలాండ్ పనులను గురువారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. అల్మాస్ ఫంక్షన్ హాల్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకునే క్రమంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

వర్షాలు ప్రారంభం కాకముందే వరద నీటి డ్రైనేజీ పనులను పూర్తి చేసి స్థానికులకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌ను ఆదేశించారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మరింత వేగంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News