Monday, January 20, 2025

కొండపై దుకాణాల్లో తునీకల కొలతల అధికారుల తనిఖీలు

- Advertisement -
- Advertisement -
  • భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు

యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి దేవస్థానం కొండపైన ఉన్నటువంటి దుకాణాల సముదాయాల్లో భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లాకు చెందిన తూనీకలు, కొలతల అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా అధికారి సంజయ్ కృష్ణ దుకాణాలలో తనిఖీలు చేయగా రెండు దుకాణాలలో వాటర్ బాటిల్‌ను ఎమ్మార్పీ కంటే రూ.5కి ఎక్కువగా భక్తులకు విక్రయిస్తుండగా తనిఖీల్లో తేలినట్లు తెలిపారు.

వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు నమోదు చేసి వాటర్ బాటిళ్లను సీజ్ చేసినట్టు అధికారి తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకే దుకాణాల్లో తనిఖీలు చేయడం జరిగిందని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణదారులకు అధికారి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News