Tuesday, November 5, 2024

ఇన్‌స్పెక్టర్ అవినీతి బాగోతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసి ప్రస్తుతం రేంజ్‌కు బదిలీ అయిన ఓ ఇన్స్‌స్పెక్టర్ భాగోతం బట్టబయలైంది. పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పోలీస్ కమిషనర్ అవినాష్‌ మహంతి దృష్టికి వెళ్లడంతో వెంటనే బదిలీ చేయడమే కాకుండా రేంజ్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది. సదురు ఇన్స్‌స్పెక్టర్ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సమయంలో స్పా వ్యాపారం మొదలు పెట్టాడు. బినామీల పేరుతో వివిధ ప్రాంతాల్లో భాగస్వామ్యంతో స్పాలను ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు. ఈ విషయం అప్పటి పోలీస్ కమిషనర్ దృష్టికి రావడంతో పిలిపించి హెచ్చరించారు. అయినా కూడా సదరు ఇన్స్‌స్పెక్టర్ స్పా వ్యాపారాన్ని వదలలేదు.

స్పా వ్యాపారంలో భారీగా డబ్బులు వస్తుండడంతో వ్యాపారాన్ని వదలలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారి అయి ఉండి భాగస్వామ్యంలో స్పా వ్యాపారం చేయడంపై పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బదిలీ చేసినట్లు తెలిసింది. స్పాల ఏర్పాటు, నిర్వహణపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి స్పా వ్యాపారం చేయడంతో పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పాత పోలీస్ కమిషనర్ అనుచరుడని పేరు ఉన్నా కూడా వ్యాపారం చేయడం వల్లే బదిలీ చేశారనే కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ఇన్స్‌స్పెక్టర్ అతిముఖ్యమైన పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పోస్టింగ్ కోసం ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీని కోసం కొంత కాలం సైబర్ క్రైంలో పనిచేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓగా వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News