Wednesday, January 22, 2025

ఇన్‌స్పైర్ -సివిల్ సర్వీసెస్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టుదల, వ్యూహం ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించటం సాధ్యమేనని నిరూపించిన 2023 సివిల్ సర్వీసెస్ విజేతలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ స్పైర్ 2023 పేరుతో ఈ నెల 20న ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. గణేష్ తదితరులు పాల్గొంటారు.

రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, ఉస్మానియా సివిల్ సర్వీసెస్ అకాడమి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులతో పంచుకుంటారని యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నవారితో పాటు ఉస్మానియాతో పాటు ఆసక్తి ఉన్న ఇతర విద్యార్థులంతా వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు యూనివర్శిటీ అండగా ఉంటుందని ఓయూ విద్యార్థుల కోసం ఇప్పటికే సివిల్ సర్వీసెస్ అకాడమీ పనిచేస్తోందని గుర్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News