Friday, October 18, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వాలనుకుంటున్నారా? జస్ట్ ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి లక్షల్లో పెరుగుతోంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను షేర్ చేయడం ద్వారా ప్రజలు చాలా తక్కువ సమయంలో మిలియన్ల వీక్షణలను పొందుతారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడం యువత కోరికగా మారింది. ఒకవేళ మీ కంటెంట్ వైరల్ కావాలనుకుంటే..ఈ కింది టిప్స్ ని ఫాలో అవ్వండి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

మీ ఫాలోవర్స్ ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. దీనితో పాటు మీ ఫాలోవర్స్ ఏ రకమైన కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడతారో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రీల్స్ క్రియేట్ చేయాలి.

మీరు పోస్ట్‌ను షేర్ చేస్తే.. అది పక్క ట్రెండింగ్ లో ఉండే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు, మీరు పోస్ట్‌ను షేర్ చేస్తుంటే..అందులో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలి. తద్వారా అది మీ పోస్ట్‌ని ఎక్కువ మంది చూసే అవకాశాలను పెంచుతుంది.

మీ ఫాలోవర్స్ తో సన్నిహితంగా ఉండటానికి..మీరు ప్రతిరోజూ అధిక-నాణ్యత కంటెంట్‌ను పోస్ట్ చేయడం ముఖ్యం. అంతేకాకుండా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పరిధిని పెంచుకోవాలనుకుంటే..మీరు ఇతర వ్యక్తులతో కొలాబరేషన్ చేయాలి అని గుర్తించుకోండి. దీంతో ఆ వ్యక్తి ఫాలోవర్స్ కూడా మీ పోస్ట్ ను చూస్తారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

1. రీల్స్ తప్పనిసరిగా 90 సెకన్ల కంటే తక్కువ పొడవు ఉండాలి. అయితే, పూర్తి స్క్రీన్ (9:16) నిలువు కారక నిష్పత్తిని కలిగి ఉండాలి.
2. సంగీతం, GIFలు, ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, కాపీరైట్ చేయబడిన కెమెరా ఫిల్టర్‌లను కలిగి ఉన్న రీల్‌లను వైరల్ చేయడం సాధ్యం కాదు.
3. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన రీల్స్‌ను కూడా వైరల్ చేయడం సాధ్యం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News