Wednesday, January 22, 2025

ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణకు గ్రిల్స్ ఏర్పాటు చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధిలోని 24, 28, 29 డివిజన్ లలో మేయర్ బుధవారం క్షేత్రస్థాయి లో పర్యటించి శానిటేషన్,ఇంజనీరింగ్ సంబంధ పనులను పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో నిరంతరం ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్దయెత్తున బయట పడుతున్నాయని, ఆ వ్యర్థాలను నిలువరించడానికి 24వ డివిజన్ పరిధి అప్నా పాన్ షాప్, పిన్న వారి వీధి ప్రాంతాలలో గ్రిల్స్ తో కూడిన జాలీ లు ఏర్పాటు చేయాలని, వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపం లో మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని,వీటి లో పేరుకు పోయిన చెత్త తొలగింపు తో పాటు డి-సిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరగాలని,సుశీల్ థియేటర్ ప్రాంతం లో రోడ్,డ్రైనేజీ పనులను ప్రారంభించాలని, అన్నపూర్ణ కిరాణం ప్రాంతంలో చెత్త రాకుండా నిలువరించడానికి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, రామా టాకీస్ నుండి పోతన రోడ్ వరకు కొత్త డ్రైన్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని,బట్టల బజార్ లో స్లాబ్ తొలగించి డ్రైన్ నిర్మించు పనులు టెండర్ దశ లో ఉన్నాయని ఇంజ నీరింగ్ అధికారులు మేయర్‌కు తెలిపారు. కార్పొరేటర్లు రమా తేజస్వి శిరీష్, సి.ఎం.హెచ్. ఓ.డా.రాజేష్,ఈ.ఈ.శ్రీనివాస్,డి. ఈ.లు రవికుమార్, సారంగం, శానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య, ఏ.ఈ.సతీష్,ఎస్. ఐ.లు శ్యామ్ రాజ్,సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News