Monday, December 23, 2024

పత్తిపాకలో బొడ్రాయి ప్రతిష్టాపన

- Advertisement -
- Advertisement -

ధర్మారం: పత్తిపాకలో పోచమ్మ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం ఎట్టకేలకు పోలీస్ బందో బస్తు మధ్య నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో పోచమ్మ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులు పూనుకోగా, పక్కనే నిర్మించిన అంబేద్కర్ విగ్రహంకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో రెండు రోజులుగా ఈ వ్యవహారం వివా దస్పందంగా మారింది. బుధవారం బొడ్రాయి ప్రతిష్టాపన కోసం గద్దె నిర్మించి ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్న గ్రామస్తులను అంబేద్కర్ సంఘాల నుండి అభ్యంతరం రావడంతో వెంటనే అధికారులు గ్రామానికి చేరుకున్నారు.

తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయశీల, పె ద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఇంద్రసేనారెడ్డి, ధర్మారం ఎస్‌ఐ శ్రీనివాస్‌లు గ్రామ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం గద్దె నిర్మించి సిద్దంగా ఉంచారని, పక్కనే బీఆర్‌ఎస్ పార్టీ జెం డా గద్దె ఉన్నందని, దాని పక్కన బొడ్రాయి ప్రతిష్టాపనకు తాము గద్దె నిర్మించామని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే భవిష్యత్‌లో బొడ్రాయి ప్రతిష్టాపన మూలంగా అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు అదికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాలతో వే ర్వేరుగా అధికారులు మాట్లాడుతుండగానే బొడ్రాయి స్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. తీవ్ర వివాదస్పదంగా మారిన పత్తిపాక పోచమ్మ బొడ్రాయి స్థాపన కార్యక్రమం ఎట్టకేలకు పోలీసు బందో బస్తు మధ్య అధికారులందరు గ్రామంలో ఉండి సమస్యల జటిలం కాకుండా పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం సుజాత రవీందర్ రెడ్డి, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, ఉ పసర్పంచ్ శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడురు లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News