Wednesday, January 22, 2025

హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో ఏర్పాటుచేసిన హనుమాన్ భారీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని గ్రామ సభ్యులతో కలిసి హనుమాన్ విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్ని మతాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికతకు పెద్దపీటవేస్తున్నారన్నారు.

యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందుతుందని కొండగట్టు వద్ద హనుమాన్ భారీ విగ్రహ ఏర్పాటు జరుగుతుందన్నారు. అలాగే ప్రతి చోట ఆధ్యాత్మికతను పెంచుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ అన్ని మతాలకు కులాలకు కావలసిన మందిరాలతో పాటు గ్రామదేవతల గుళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.

అదేవిధంగా ప్రతి ఒక్కరూ భక్తిలో నిమగ్నం అవుతూ హిందూ ధర్మాన్ని ఆచారాలను కాపాడుకోవాలన్నారు. భారతదేశంలో హిందూ ధర్మానికి ఉన్న ప్రాచుర్యం విభిన్న సంస్కృతలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేష్, వైస్ ఎంపీపీ కొమ్రా జంగు, జిట్టా రమేష్, మేస్రం పరమేశ్వర్, నాగుబాయ్ కిషన్ మెట్టు ప్రహ్లాద్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News