Wednesday, January 22, 2025

దట్టమైన మంచులోనూ రైళ్లకు ‘కవచ్’

- Advertisement -
- Advertisement -

రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (కవచ్)ను అందుబాటు లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తోందని ఇప్పటికే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పలుమార్లు వెల్లడించారు. తాజాగా కవచ్ పనితీరుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. కవచ్ వ్యవస్థ సాయంతో దట్టమైన పొగమంచులోనూ పట్టాలపై రైలు దూసుకెళ్తున్న వీడియో అది.

ఇక లోకో పైలట్ బయటకు చూడకుండానే కవచ్ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు. సాధారణంగా విపరీతమైన పొగమంచు ఉన్నప్పుడు లోకోపైలట్‌కు ఒక్కోసారి సిగ్నల్ కూడా కన్పించని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువ. ఇప్పుడు కవచ్‌తో ఆ సమస్య ఉండబోదని రైల్వే మంత్రి వివరించారు. ఈ వ్యవస్థ సాయంతో బయట ఏం సిగ్నల్ పడిందనేది క్యాబిన్ లోని మానిటర్ పైనే లోకోపైలట్ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News