Friday, January 24, 2025

జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

- Advertisement -
- Advertisement -

ముంబై: అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ పంఘ్ చాలక్ మోహన్ భగవత్ మంగళవారం ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్‌లో విజయ దశమి సందర్భంగా ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని దేశంలోని వివిధ ప్రదేశాలలో కూడా జరుపుకోవాలని ఆయన తెలిపారు.

భారతదేశంలోని విద్యను, సంస్కృతిని నాశనం చేయడానికి సాంస్కృతిక మార్కిస్టులు స్వార్థపరశక్తులు మీడియా, బోధనారంరాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధ్యంసకర శక్తులు తమను తాము జాగృత శక్తులుగా అభివర్ణించుకుంటూ గొప్ప లక్ష్యాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయని, కాని వాటి అసలు లక్ష్యాలు ప్రపంచంలో అస్థిరతను సృష్టించడమేనని ఆయన అన్నారు. సమాజంలోని సామరస్యతను దెబ్బతీసి ఘర్షణలు సృష్టించడమే ఈ సాంస్కృతిక మార్కిస్టుల అసలు లక్ష్యాలని ఆయన ఆరోపించారు.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇది వాంఛనీయం కానప్పటికీ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స
మాజంలో ఐక్యతను దెబ్బతీసే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని, దీన్ని అందరూ పాటించాలని ఆయన కోరారు. మన దేశ సమైక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని భగవత్ పిలుపునిచ్చారు.

మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితిని ఆయన ప్రస్తావిస్తూ దాదాపు దశాబ్దం పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో హఠాత్తుగా పరస్పర విద్వేషం, ఘర్షణలు తలెత్తాయని చెప్పారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. శాంతి కోసం ఒక చర్యను తీసుకున్న వెంటనే అక్కడ ఒక సంఘటనను సృష్టించడం ద్వారా విద్వేషాన్ని, హింసను ప్రేరేపించిన శక్తులు ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News