జైపూర్: అమ్మాయిలకు అద్దెకు ఇచ్చిన ఫ్లాట్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆన్‌లైన్‌లో వాటిని వీక్షిస్తున్న రాజేంద్ర సోని అనే వ్యక్తిని రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టులో హజరుపరిచారు. షార్ట్ సర్క్యూట్ జరగడంతో తాము నివసిస్తున్న ఫ్లాట్‌లో రహస్య కమెరాలు ఉన్న విషయం బాలికలకు తెలిసిందని, దీని ఆధారంగానే ఫ్లాట్ యజమాని రాజేంద్ర సోనిని అరెస్టు చేయడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అందులో ఉంటున్న బాలికలు ఎలక్ట్రిషయన్‌ను పిలిపించారు.
Also Read: యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే
అతడు చెక్ చేయగా బెడ్‌రూములు, బాత్‌రూముల్లో అనేక రహస్య కెమెరాలు బయటపడ్డాయి. దీంతో బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27న రాజేంద్ర సోనిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా అతడికి మే 15 వరకు కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసుల ఇంటరాగేషన్‌లో రాజేంద్ర సోని తన తప్పు ఒప్పుకున్నాడు. సిసిటివి కెమరాలు, కంప్యూటర్ల వ్యాపారం తనకు ఉందని అతను చెప్పాడు. ఉదయ్‌పూర్‌లో చదువుకోవడం కోసం ఇతర నగరాల నుంచి వచ్చే బాలికలకు తన ఫ్లాట్ అద్దెకు ఇస్తానని అతను తెలిపాడు. సెలవుల్లో బాలికలు తమ ఇళ్లకు వెళ్లినపుడు డూప్లికేట్ కీతో ఫ్లాట్ తెరచి మూడు కెమెరాలు అమర్చానని అతను వెల్లడించాడు.