Monday, January 27, 2025

Q2 2023లో ఇండియన్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగుళూరులో ఉన్న వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తన పెట్టుబడి నివేదిక “భారతీయ రియల్ ఎస్టేట్ Q2 2023లో సంస్థాగత పెట్టుబడి”ని ప్రచురించింది. మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో కూడా భారతీయ రియల్ ఎస్టేట్ రంగం విశేషమైన స్థిరత్వం ప్రదర్శించిందని నివేదిక పేర్కొంది. వెస్టియన్ రీసెర్చ్ ప్రకారం, క్యూ2 2023లో సంస్థాగత పెట్టుబడులు USD 1.6 బిలియన్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంతో పోలిస్తే గణనీయమైన 33.3% పెరుగుదల నమోదు చేసింది. అయితే, సంస్థాగత పెట్టుబడులు Y-o-Y పద్దతిలో 40.7% తగ్గాయి, ఇది మార్కెట్‌లో కొంత స్థాయి అస్థిరతను వెల్లడిస్తుంది.

వెస్టియన్ సీఈఓ FRICS, శ్రీనివాసరావు మాట్లాడుతూ… “గత త్రైమాసికంతో పోలిస్తే Q2 2023లో సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం రాబోయే త్రైమాసికాలలో బలమైన జిడిపి వృద్ధి, రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ట్రాక్షన్‌ను పొందే అవకాశం ఉంది” అని అన్నారు. వాణిజ్య ఆస్తులలో (ఆఫీస్ , రిటైల్, కో-వర్కింగ్, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌లు) పెట్టుబడులు 2023 క్యూ2లో 88%కి పెరిగాయి. ఆఫీస్ స్పేస్‌ లకు కొత్త డిమాండ్‌ను నివేదిక సూచించింది. దీనికి విరుద్ధంగా, తక్కువ రాబడినిచ్చే పెట్టుబడులు సంస్థాగత పెట్టుబడిదారులకు తక్కువ ఆకర్షణను కలిగి ఉన్నందున, నివాస రంగం వాటా Q1 2023లో 27% నుండి 2023 Q2లో 4%కి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News