న్యూఢిల్లీ : ఈ సంవత్సరం(2023) క్యూ2లో భారతీయ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో సంస్థాగత పెట్టుబడులు వార్షికంగా 40.7 శాతం తగ్గుముఖం పట్టాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ వెల్లడించింది. వెస్టియన్ రీసెర్చ్ ప్రకారం, మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో కూడా భారతీయ రియల్ ఎస్టేట్ రంగం విశేషమైన స్థిరత్వం ప్రదర్శించింది. సంస్థాగత పెట్టుబడులు వార్షికంగా 40.7 శాతం తగ్గాయి, ఇది మార్కెట్‌లో కొంత అస్థిరతను వెల్లడిస్తుంది.
క్యూ2లో సంస్థాగత పెట్టుబడులు 1.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, గత త్రైమాసికంతో పోలిస్తే 33.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. వెస్టియన్ సిఇఒ, ఫ్రిక్స్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత త్రైమాసికంతో పోలిస్తే 2023 క్యూ2లో సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం రాబోయే త్రైమాసికాలలో బలమైన జిడిపి వృద్ధి, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసే అవకాశం ఉందన్నారు.