Sunday, December 22, 2024

కాళికాదేవి అమ్మవారికి అవమానం: ఉక్రెయిన్ క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కాళికాదేవి అమ్మవారిని అవమానించే విధంగా కార్టున్‌ను ట్వీట్ చేసినందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ హిందువులకు క్షమాపణ చెప్పింది. హిందువుల దేవత కాళికాదేవి అమ్మవారిని కించపరిచేవిధంగా తమ రక్షణ శాఖ ఒకకార్టూన్‌ను ట్వీట్ చేసిందని, అందుకు తాము క్షమాపణ చెబుతున్నామంటూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి ఎమినె జెప్పర్ ట్వీట్ చేశారు. తమ దేశం భారతీయ విశిష్ట సాంప్రదాయాన్ని గౌరవిస్తుందని, తమకు భారత్ నుంచి అందుతున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు. కాళికామాతను కించపరిచే విధంగా ఉన్న కార్టూన్‌ను ఇప్పటికే తొలగించినట్లు ఆయన తెలిపారు.

ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ఏప్రిల్ 30న పోస్టు చేసిన ఒక కార్టూన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన గురుతున్న స్కర్ట్‌తో అలనాటి హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ఫోటోకు కాళికాదేవి ముఖాన్ని తగిలించి బ్యాక్ గ్రౌండ్‌లో విస్ఫోటనం దృశ్యంతో కూడిన కార్టూన్‌ను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. దీనికి వర్క్ ఆఫ్ ఆర్ట్ అని శీర్షిక పెట్టింది. అయితే ఈ కార్టూన్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఉక్రెయిన్ రక్షణ శాఖ ఈ ట్వీట్‌ను డెలిట్ చేసింది.

హిందూ మతస్తుల పట్ల దాడిగా కొందరు నెటిజన్లు ఉక్రెయిన్ రక్షణ శాఖపై మండిపడ్డారు. ఈ ట్వీట్ దిగ్భ్రాంతికరంగా ఉందని, హిందువులు కొలిచే కాళికాదేవి అమ్మవారిని ఇంత అసభ్యంగా చిత్రీకరించడం ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖకు తగదని, ఇది కళాత్మకత కాదని, హిందువుల విశ్వాసం జోక్ కాదని, వెంటనే దీన్ని తొలగించి క్షమాపణ చెప్పండంటూ ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 140 కోట్ల భారతీయుల మనోభావాలను గాయపరచడం ఆమోదయోగ్యం కాదని, ఇది హిందువుల పట్ల ఉక్రెయిన్ రక్షణ శాఖ చూపుతున్న విద్వేషమని మరో నెటిజన్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News