- Advertisement -
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతి ముర్ముకు బదులు ప్రధాని మోడీని ఆహ్వానించడం రాష్ట్రపతి ముర్ముకు, గిరిజన, వెనుకబడిన తరగతుల సమాజానికి తీరని అవమానమని ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్ ) సోమవారం ధ్వజమెత్తింది. ఈ వైఖరి అధికార బీజేపీ గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందని పాత్రికేయ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆప్ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేశారని, కానీ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రమ్మని మాత్రం పిలవరని, ఇది ఘోరమైన అవమానమేనని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -