Thursday, January 23, 2025

ఫోటో గ్రాఫర్లకు బీమా: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎంతో సంప్రదించి నిర్ణయం
ఫోటో, వీడియో గ్రాఫర్స్ ప్లీనరీలో మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : ఫోటో గ్రాఫర్లకు బీమా కల్పించేందుకు ప్రయత్నించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లీనరీ సమావేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం కోరిన డిమాండ్లు సహేతుకమైనప్పటికీ నిబంధనలను అనుసరించి ప్రాధాన్యతా క్రమంలో తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు.

సంక్షేమ సంఘానికి జిల్లా కేంద్రాలలో కార్యాలయాలు ఉండాలన్న విజ్ఞప్తికి మంత్రి స్పందిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఇది అమలు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చిన మార్పులు లాభంతో పాటు నష్టాన్ని కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ రూపంలో మొదలు నష్టపోయింది ఫొటోగ్రాఫర్లేనన్నారు. ఈ సమావేశంలో సంఘం బాధ్యులు ఎస్.వెంకట్ రెడ్డి, ఎస్‌కె హుస్సేన్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మునగాల శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News