Sunday, January 19, 2025

ఆర్థిక భద్రతకు బీమా తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

71 శాతం బీమా చేయని భారతీయులు వెల్లడి : ఎస్‌బిఐ లైఫ్

న్యూఢిల్లీ : ఆర్థిక భద్రత కోసం బీమా ఒక కీలకమైన అంశమని 71 శాతం మంది బీమా చేయని భారతీయులు భావిస్తున్నారు. ఎస్‌బిఐ లైఫ్ ‘ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ స్టడీ 3.0’ పేరిట నివేదికలను విడుదల చేసింది. ఎస్‌బిఐ లైఫ్ నాలెడ్జ్ భాగస్వామి- డెలాయిట్ సహకారంతో ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 41 నగరాల్లోని 5,000 మందితో సర్వే చేసింది. దీని ప్రకారం, 80 శాతం మంది వినియోగదారులు బీమా అనేది ఆర్థిక భద్రతను సాధించడానికి కీలకమైన సాధనంగా భావిస్తున్నారు.

కానీ 94 శాతం మందికి బీమా లేదు లేదా తగినంతగా కవర్ చేయడం లేదు. 37 శాతం మంది వినియోగదారులు ఫైనాన్సియల్ ఇమ్యూనిటీని బహుళ ఆదాయ వనరులతో సమం చేశారు. గత ఐదేళ్లలో దాదాపు సగం మంది అంటే 47 శాతం బీమా చేయించుకున్న వ్యక్తులు తమ ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేశారు. వైద్య ఖర్చుల పెరుగుదల, పెరుగుతున్న జీవన వ్యయంపై వినియోగదారుల ప్రధాన ఆందోళనగా ఉంది. 41 శాతం మంది ‘ద్వితీయ ఆదాయం’ కలిగి ఉండటం ఆర్థిక రక్షణ ని బలోపేతం చేయగలదని పేర్కొన్నారు. 80 శాతం వినియోగదారులు పూర్తిగా యజమాని అందించిన బీమా పాలసీలపై ఆధారపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News