Thursday, January 16, 2025

‘మాల్స్ కావు’.. మన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మోడీ సర్కార్, కాం గ్రెస్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా ఆయన విరుచుకుపడుతుంటారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు. తాజాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటె డ్ మార్కెట్లు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆయా మార్కెట్లలో శాకాహారంతోపాటు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు.

మున్సిపల్ శాఖ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై నమూనా ఫోటోలను ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మా ర్కెట్ల ఫొటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృ షి చేసిన స్థానిక ఎంఎల్‌ఎలు, మున్సిపల్ చైర్మన్లను ట్విట్టర్‌లో అభినందించారు. తెలంగా ణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్, నా న్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగిం ది. 2 లక్షల జనాభాకు కనీసం ఒక మార్కెట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. శాస్త్రీయ విధానంతో రాష్ట్ర వ్యా ప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నామని శాసనసభలో కెసిఆర్ తెలిపారు. నేల పై కూరగాయలు విక్రయిస్తే బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉం దన్నారు. మోండా మార్కెట్ తరహా లో రాష్ట్రంలో నూ మార్కెట్‌లు నిర్మించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లను ప్రభుత్వం ప్రారంభించిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News