Sunday, December 22, 2024

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 226 పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది.

కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ విభాగంలో 147 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు జనవరి 12వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News