- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉగ్రవాదలు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. 26/11 ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా సముద్రతీరం ఉన్న నగరాలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. నిఘా సంస్థలు పేర్కొన్నాయి. సముద్ర మార్గంలోనే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి 26/11 ఉగ్రదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఇడిలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీరం కలిగిన నగరాలు ఎక్కువ నిఘా పెంచాలని సూచించింది.
- Advertisement -