Friday, December 20, 2024

సిఎం సెక్యూరిటీలో లీక్ వీరులపై వేటు

- Advertisement -
- Advertisement -

ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డికి భద్రతకు సంబంధించి రాష్ట్ర ఇంటెలిజె న్స్ విభాగం కీలక నిర్ణయం తీ సుకుంది. ఆయన దగ్గర ఉన్న పోలీస్ భద్రతా సిబ్బందిని పూ ర్తిగా మార్చాలని నిర్ణయించిం ది. సీఎంకు సంబంధించి ప్రతీ సమాచారం లీక్ అవుతుందనే సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో కెసిఆర్ వ ద్ద పనిచేసిన కొందరు సిబ్బం ది ఇప్పుడు రేవంత్ వద్ద ఉండ గా వారిని మార్చాలని నిర్ణయించారు.

మాజీ సిఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా సిఎం వద్ద పెట్టొద్దని సిఎంఒను ఐబి ఆదేశించింది. కాగా, సిఎం దావో స్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తె లిసిందని సిఎం ఇంటెలిజెన్స్ అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమం లో సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చారు. అటు, తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక పలు విభాగాల అధిపతులను మారుస్తూ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కీలక నిఘా విభాగాధిపతిగా శివధర్ రెడ్డిని నియమించారు.

బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూయిజర్లతో సిఎం కాన్వాయ్
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సచివాలయంలో కొత్త కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు. అప్పటి వరకు సిఎంకు నలుపు రంగు కార్లతో కాన్వాయ్ ఉండగా సిఎం రేవంత్ రెడ్డి కోసం అన్ని తెలుపు రంగు కార్లతో కాన్వాయ్ సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మళ్లీ నలుపు రంగు కార్లతో నిండింది. అదీ ల్యాండ్ క్రూయిజర్ కార్లతో సిఎం కాన్వాయ్ ఉండటం గమనార్హం. ఈ ల్యాండ్ క్రూయిజర్లు అన్నీ కూడా కెసిఆర్ హయాంలో కొనుగోలు చేసినవే. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అటే దావోస్, లండన్‌లలో పర్యటించి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత కాన్వాయ్ విషయంలో కీలక మార్పులు జరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News