- Advertisement -
న్యూఢిల్లీ : పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని ఐఈడి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింత పకబ్బందీగా పెంచాలని సూచించింది. జనవరి 29 న ఢిల్లీ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహా లోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకుని ముష్కర మూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈనెల 6న ఇజ్రాయెల్ పౌరుల శెలవులు ప్రారంభం కానున్నాయి. వారిని లక్షంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్ రెస్టారెంట్, చాబాద్ హౌస్, యూదుల కమ్యూనిటీ సెంటర్ వంటి ప్రాంతాల్లో వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలని సూచించింది.
- Advertisement -