Sunday, December 22, 2024

హిమాచల్‌లో నువ్వా.. నేనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గిరి రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నాయి. ఆజ్ తక్ ఆక్సిస్ మై ఇండియా అంచనాల మేరకు 68 స్థానాల హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్30 నుంచి 40 సీట్లు, బిజెపికి 24 నుంచి 34 మధ్యలో సీట్లు రావచ్చునని వెల్లడైంది.

ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ః బిజెపికి 35 40, కాంగ్రెస్‌కు 30 40 స్థానాలు రావచ్చు. న్యూస్ ఎక్స్ జన్‌కీ బాత్ సర్వే ప్రకారం బిజెపికి 32 40, కాంగ్రెస్‌కు 2734 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. హిమాచల్‌లో ఆప్ ఒక్కసీటూ రాదని, ఒకటి నుంచి మూడు మధ్యలో సీట్లు రావచ్చునని పలు సర్వేల్లో స్పష్టంఅయింది. రిపబ్లిక్ టీవీ పి మార్యూ అంచనాల మేరకు బిజెపికి 3439 , కాంగ్రెస్‌కు 2833 స్థానాలు, ఆప్ 0 నుంచి 1 స్థానం మధ్యలో స్థానాలు వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News