Saturday, November 23, 2024

తీవ్రమౌతున్న వేసవి తాపం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వేసవి తాపం పెరుగుతోంది. అనేక చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాతోపాటు పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నెలకొన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలియజేసింది. దేశంలో ఈ నెలలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఇది రెండోసారి. తొలిదశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రమైంది. ఎల్‌నినో పరిస్థితులు బలహాన పడుతున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య ఉష్ణోగ్రతలు పెరగొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. 1020 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సహా పలు రాష్ట్రాల్లో అది 20 రోజుల కన్నా ఎక్కువగా కొనసాగవచ్చని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News