Tuesday, January 21, 2025

మున్నేరు వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు: తుమ్మల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మున్నేరు వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో తమ్ముల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. వరద ఉద్ధృతి తగ్గాక చురగ్గా పారిశుద్ధ్య పనులు చేపడుతామని, పారిశుద్ధ్య విధుల్లో 600 మంది సిబ్బంది ఉన్నారని, పది డివిజన్లలో 7480 ఇండ్లు దెబ్బతిన్నాయని, ఇళ్లలో బురద తొలగించేందుకు ట్యాంకర్లు సహాయంతో నీళ్లు సరఫరా చేస్తున్నామని, గ్రామాల్లో 12 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మంలో దెబ్బతిన్ని 197 విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టామని, సాయంత్రం కల్లా ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని తుమ్మల వివరించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశామన్నారు.

ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రిలో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఉద్ధృతంగా కిన్నెరసాని ప్రవాహిస్తుండడంతో ఎజెన్సీ వాసులు ఇబ్బందులు పడ్డారు. గుండాల, కొడవటంచ మధ్య ఏడు మెలికల వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. లోలెవల్ వంతెనపై ఉద్ధృతితో కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News