Wednesday, January 22, 2025

పెట్రోల్, డీజెల్‌పై జిఎస్‌టి విధింపు కేంద్రం ఉద్దేశం

- Advertisement -
- Advertisement -

పెట్రోల్, డీజెల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, రాష్ట్రాలే కూర్చుని రేటుపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెప్పారు. పెట్రోల్, డీజెల్‌లను జిఎస్‌టి చట్టంలో చేర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇదివరకే ఒక సూచన చేశారని, వాటిపై విధించే రేటును రాష్ట్రాలే కూర్చుని, నిర్ణయించవలసి ఉంటుందని ఆమె అన్నారు.

‘ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ సూచన ప్రకారం జిఎస్‌టి పరిధిలో కి పెట్రోల్, డీజెల్ తీసుకురావాలి. రేటును నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రాల పని. నా ముందు మంత్రి ఉద్దేశంసుస్పష్టం. పెట్రోల్, డీజెల్ జిఎస్‌టి పరిధిలో ఉండాలని కోరుతున్నాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు, జిఎస్‌టిని ప్రవేశనపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే మున్ముందు ఏదో ఒక సమయంలో పెట్రోల్, డీజెల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలన్నదే అని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News