Monday, December 23, 2024

ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Inter 2nd Year English Syllabus Change in Telangana

ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు
కొత్త సిలబస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సిలబస్‌తో ముద్రించిన పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి కొత్త ఇంగ్లీష్ పుస్తకాలు అందించనున్నారు. కొత్త సిలబస్‌తో ముద్రించిన పుస్తకాలు త్వరలో బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Inter 2nd Year English Syllabus Change in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News