Saturday, December 21, 2024

ఇంటర్ విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లిస్తే హాజరు మినహాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లకుండా ఆర్ట్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తరువాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలు రాసుకునే వీలు కల్పిస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 040-24600110 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రద బాయి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News