Monday, December 23, 2024

నేడు ఇంటర్ పరీక్షల కొత్త తేదీలు

- Advertisement -
- Advertisement -

Inter board will announce new dates for inter exams today

ముందుగానే టెన్త్ పరీక్షలపై కసరత్తు

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ పరీక్షల షెడ్యూలు మార్పు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్,టెన్త్ పరీక్షలపై పడింది. మారిన జెఇఇ మెయిన్ షెడ్యూల్‌కు అనుగుణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను సవరించి బుధవారం లేదా గురువారం ఇంటర్ బోర్డు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ఒకసారి మారగా, తాజాగా పరిణామాలతో మరోసారి మారనుంది. దాంతోపాటు పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా సవరించనున్నారు. దీంతో పరీక్షల షెడ్యూల్ మా ర్పుపై ఇంటర్ బోర్డు, ఎస్‌ఎస్‌సి బోర్డు కసరత్తు ప్రారంభించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, తాజాగా నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ మార్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీలలో జరుగనున్నాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ పరీక్షలు, మే 11 నుంచి టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. తాజాగా జెఇఇ మెయిన్ షెడ్యూల్ మారిన నేపథ్యంలో ఇంటర్‌తో పాటు టెన్త్ షెడ్యూల్ మారనుంది.

పలు ప్రతిపాదనలపై పరిశీలన

జెఇఇ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యేలోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నట్లు తెలిసింది. జెఇఇ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 21న ప్రారంభమై మే 4వ తేదీతో ముగుస్తాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఒకవేళ ఇంటర్ పరీక్షలను జెఇఇ మెయిన్ కంటే ముందే నిర్వహించవలసి వస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులు సమయం సరిపోతుందా..? అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షలను వాయి దా వేస్తే మే 4 తర్వాత పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది.

ఆ పరీక్షలు ముగిసిన తర్వాతనే టెన్త్ పరీక్షలను ప్రారంభించాలి. మే నెలలో ఎండత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ నెలలో పరీక్షలు నిర్వహిస్తే టెన్త్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుం దా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయి దా వేసి మే 4 తర్వాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించడం లేదా ముందుగా టెన్త్ పరీక్షలు నిర్వహించి, తర్వాత ఇంటర్ పరీక్షలను నిర్వహించే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జెఇఇ మెయిన్ మార్పులకు అనుగుణంగా ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

ఏప్రిల్ చివరి వారంలో ఎస్‌ఎస్‌సి పరీక్షలు నిర్వహించాలి : యుటిఎఫ్

జెఇఇ మెయిన్ పరీక్షల రీషెడ్యూల్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు ఆలస్యమయ్యే పక్షంలో ఎస్‌ఎస్‌సి పరీక్షలు ముం దుగానే నిర్వహించాలని ప్రభుత్వానికి యుటిఎఫ్ విజ్ఞప్తి చేసింది. వేసవి అధిక వేడిమి కారణంగా హైస్కూల్ వి ద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను మే 11కు బదులు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించాలని కోరారు. టెన్త్‌లో ఆరు పేపర్లే కాబట్టి ఏప్రిల్ 25 నుండి 30 వరకు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News