Friday, November 15, 2024

జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వ చ్చే విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు 2024 25 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరాని కి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు వి డుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో మొత్తం 227 పని దినాలలో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం తరగతులు మొదలవుతాయి.

అక్టోబరు 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. 2024 నవంబర్ 18 నుంచి 23 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 29 చివరి పనిదినం అని ఇంటర్ బోర్డు వెల్లడించింది. 2025 మార్చి 30 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు అమలవుతాయని తెలిపింది. 2025 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్

2024 జూన్ 1 నుంచి ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం
2024 అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు
2024 నవంబర్ 18 నుంచి 23 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు
2025 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
2025 జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు
2025 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు
2025 మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు
2025 మార్చి 29 చివరి పనిదినం
2025 మార్చి 30 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు
2025 మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
2025 జూన్ 2న జూనియర్ కాలేజీల పునః ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News