Saturday, November 23, 2024

జూన్ 15 నుంచి ఇంటర్ తరగతులు

- Advertisement -
- Advertisement -

వచ్చే విద్యాసంవత్సరంలో 221 పనిదినాలు
2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు
మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ఇంటర్ బోర్డు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం జూన్ 15 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం, జులై 1 నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఇంటర్ బోర్డు 2022 23 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటిం చింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. జూన్ 15 నుంచి సెకండ్ ఇయర్,జులై 1 నుంచి ఫస్ట్ ఇయర్ ఇంటర్ తరగతులు మొదలవుతాయి.

అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 31 చివరి పనిదినం అని బోర్డు వెల్లడించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయని తెలిపింది. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీన జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్

2022 జూన్ 15 నుంచి సెకండియర్ తరగతులు ప్రారంభం

2022 జులై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం

2022 అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు

2022 నవంబర్ 11 నుంచి 26 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు

2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు

2023 ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు

2023 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు

2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు

2023 మార్చి 31 చివరి పనిదినం

2023 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు

2023 మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

2023 జూన్ 1న జూనియర్ కాలేజీల పునః ప్రారంభం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News