Sunday, December 22, 2024

ఓవరాల్ ఛాంపియన్ హైదరాబాద్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతర్‌ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ స్విమ్మింగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టీమ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. నగరంలోని బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో రెండు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. కాగా, ఈ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ 410 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

రంగారెడ్డి జిల్లాకు రెండో స్థానం దక్కింది. శివాని ఐదు స్వర్ణాలతో సత్తా చాటింది. బాలుర విభాగంలో అరూష్ దాస్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకున్నాడు. స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ బాలికల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో పసిడి పతకం గెలుచుకుది. అనంతరం జరిగిన కార్యక్రమంలో భారత స్విమ్మింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, రాష్ట్ర స్విమ్మింగ్ సంఘం అధ్యక్షుడు పి. చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేశ్ తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News