Monday, January 20, 2025

అంతర్ జిల్లా దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదినా దుబ్బాక రోడ్డులో గల మసీదు వద్ద ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లో చొరబడడానికి యత్నించిన దుబ్బాకకు చెందిన మహమ్మద్ రఫీక్‌ను ముస్తాబాద్ శివారులో అరెస్టు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాకకు చెందిన రఫీక్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

వచ్చే జీతం సరిపోక జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్ చేసుకుని దొంగతాలు చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదిన ముస్తాబాద్ మందాటి మల్లయ్య తాళం బద్దలు కొట్టి చొరబడడానిక ప్రయత్నిస్తుండగా ఇంటి యజమానులు రావడంతో అక్కడి నుండి పారిపోయాడు.

వారి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం సాయంత్రం ముస్తాబాద్ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న రఫీక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఫింగ్ ప్రింట్ ఆధారంగా గతంలో నేరస్తుడని తెలిసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News