Monday, April 21, 2025

త్రిశంకు స్వర్గంలో ఇంటర్ విద్య

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు రంగంలో ఇంటర్మీడియట్ బోధించే కళాశాలల సంఖ్య 1385 ఉన్నాయి. అంటే ప్రైవేటు రంగంలోనే జూనియర్ కళాశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక కార్పొరేట్ కళాశాలలు అయితే ఒక్కో పట్టణం లో పది జూనియర్ కళా శాలలు బ్రాంచీలు పెట్టి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఇంట ర్మీడియట్ మాత్రమే బోధిస్తారు. ఇంటర్మీడియట్ బోధించే లెక్చరర్లు పిజి టీచర్లు ప్రభుత్వ రంగంలో 6,992 మంది ఉన్నారు. ఇంత మంది లెక్చరర్స్ ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అనే సామెత గా మారింది.

పదవ తరగతి పరీక్షలు అవగానే ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రతినిధులు, మరో మాటలో చెప్పాలంటే ఏజెంట్లు తల్లిదండ్రుల వెంటపడి అడ్మిషన్ల తంతు పూర్తి చేసుకుంటున్నారు. కొన్ని కళాశాలలైతే వేసవి సెలవుల నిబంధనలు తుంగలో తొక్కి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిరోధించాలసిన విద్యాశాఖ ఓ పత్రికా ప్రకటన జారీ చేసి కళ్ళు మూసుకుంటుంది. అటు ఉన్నత విద్య డిగ్రీకి, ఇటు ప్రాథమిక విద్యకు మధ్య ఇంటర్మీడియట్ విద్య అత్యంత కీలకమైన పునాది అంశం కావడంతో తల్లిదండ్రులు కాస్తా ఇంటర్‌పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక దానిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలలు యాజమాన్యం ఇంటర్ విద్య ను కీలకమైన వ్యాపారంగా స్వీకరించింది.

ఒకప్పడు ఇంటర్మీడియట్ విద్యకు ప్రభుత్వ కళాశాలలే కీలక అంశంగా ఉండేవి. ప్రభుత్వ కళాశాలలోనే చదువుతూ ఎంసెట్ కోచింగ్ కు సబ్జెక్టులవారీగా బయట తీసుకునేవారు. ప్రైవేటు కళాశాలలు కుప్పలుతెప్పలుగా వెలిసిన తర్వాత బోధన, కోచింగ్ ఒకే చోట లభించడంతో ప్రైవేటు కళాశాలలు వైపు విద్యార్థులు మరలుతున్నారు. కీలకమైన గణితం, సైన్స్ ప్రాధాన్యత ఉన్న ఇంటర్ గ్రూపుల కోసం ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఫీజులు కట్టలేని పేదలు మాత్రమే అరకొర ప్రభుత్వ కళాశాలలో చేరి కామర్స్, ఆర్ట్ లాంటి హెచ్‌ఇసి, సిఇసి లాంటి గ్రూపుల్లో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉన్న గురుకుల పాఠశాలలు 500 వరకు ఉండగా, కేవలం ఇంటర్మీడియట్ బోధిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 469 మాత్రమే ఉన్నాయి. ఇక ప్రైవేటు రంగంలో ఇంటర్మీడియట్ బోధించే కళాశాలల సంఖ్య 1385 ఉన్నాయి. అంటే ప్రైవేటు రంగంలోనే జూనియర్ కళాశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక కార్పొరేట్ కళాశాలలు అయితే ఒక్కో పట్టణం లో పది జూనియర్ కళాశాలలు బ్రాంచీలు పెట్టి నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే బోధిస్తారు. ఇంటర్మీడియట్ బోధించే లెక్చరర్లు పిజి టీచర్లు ప్రభుత్వ రంగంలో 6,992 మంది ఉన్నారు. ఇంత మంది లెక్చరర్స్ ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అనే సామెత గా మారింది. జూనియర్ కళాశాల వ్యవస్థ పతనంలో చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు తమ క్యాచ్‌మెంట్ ఏరియాలోని విద్యార్థులను తమ కళాశాలలో చేరమని కనీసం అడగరు. జూనియర్ కళాశాలల్లో సరైన మానెటరింగ్ ప్రక్రియ ఉండడం లేదు. జూనియర్ లెక్చరర్ల నియామకంలో కూడా పిజి అరకొర పూర్తి చేసిన బోధనేతర సిబ్బందిని ప్రమోషన్లపై లెక్చరర్లుగా నియమించడం కూడా ఒక రకంగా విద్యా ప్రమాణాల తరుగుదలకు కారణం అవుతున్నది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధించే లెక్చరర్లు అన్ని సబ్జెక్టులకు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం అందుకనుగుణంగా లేదు.

నూతన విద్యా విదానం 2020 ప్రకారం, విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం 2+3+3+4 ప్యాట్రన్ ప్రకారం 9, 10 తరగతుల్లో ఇంటర్ విద్యను పాఠశాలలోనే నిర్వహించవలసి ఉంది. కానీ, చట్టం వచ్చి 15 ఏళ్ళు అయినా ఆ ప్యాట్రన్ అమలు జరపడంలో ఇంకా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంటర్ కళాశాలల్లో బోధించే జూనియర్ లెక్చరర్స్ కూడా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్ విద్య పాఠశాలలో కొనసాగించడం వలన ప్రైవేటు కళాశాల వ్యవస్థ కొంతలో కొంతైనా దెబ్బ తింటుంది. సామాన్య ప్రజలకు ఇంటర్మీడియట్ చదువులో ఫీజులు భారం కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్న వ్యవస్థలను డొలుపుకుపోయో ధోరణి తప్ప నూతన మార్పులు స్వీకరించే పరిస్థితి లేదు? ఇంకా ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ఫీజులదందా మామూలు గా లేదు. ఒక్క ‘డే’ స్కాలర్‌కే లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు.

ఇక రెసిడెన్షియల్ కళాశాలలోనైతే రెండు లక్షల నుండి మూడు లక్షలు దండుకుంటున్నారు. మొదట విద్యార్థుల చేర్చుకుని వరకు సౌమ్యంగా కనిపించిన యాజమాన్యం ఫీజులు వసూలు సమయానికి కఠినంగా మారుతున్నారు. సామాన్యుల ఆర్థిక స్థితిగతులు కూడా ఎంతమాత్రం పరిగణలోనికి తీసుకోకుండా వేధింపులకు గురిచేస్తారు. పిల్లలను కూడా మానసికంగా, భౌతికంగా చేసే వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు కళాశాలలు ఎక్కువ మంది ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు నడపడం వలన పరోక్షంగా ప్రభుత్వం మద్దతు కూడా వీరికి అన్యోపదేశంగా లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఇంటర్మీడియట్ అనుబంధంగా ఉన్న గురుకుల పాఠశాల అనుభవాలు తీసుకొని కొన్ని పాఠశాలల్లోనైనా ఇంటర్ అందుబాటులోకి వస్తే బాలికల డ్రాప్‌అవుట్స్ సంఖ్య, బాల్యవివాహాలు సంఖ్య కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక పాఠశాల ఇంటర్ విద్యలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాల్సిన అవసరం ఉంది.

లేబరేటరీ టెక్నీషియన్, నర్స్ శిక్షణ, పారిశ్రామిక శిక్షణ, కంప్యూటర్ విద్య, కృత్రిమ మేధ, ఫ్యాషన్ డిజైన్, అగ్రికల్చర్, సిరికల్చర్, హార్టికల్చర్ లాంటి వృత్తి విద్యా కోర్సులు చేర్చడం వలన బడుగుబలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరగడంతోపాటు ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలుకు ప్రాణప్రతిష్ట చేసినట్లు అవుతుంది. ఈ దశలో ఎంసెట్ లాంటి శిక్షణతో పాటు, లైంగిక విద్య, నైతిక విద్య సైతం బోధించడం ఇంటర్మీడియట్ స్థాయిలో సామాజిక అవసరంగా భావించాల్సి ఉంటుంది. అంతేకాక, ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థుల మాతృభాషను లాంగ్వేజ్‌గా తప్పనిసరిగా చేయాల్సిన అవసరం కూడా ఉంది.

ప్రైవేటు కళాశాలలు వేసవి సెలవులులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగీష్, తెలుగు, సంస్కృతం లాంటి లాంగ్వేజ్ సిలబస్ పూర్తి చేసుకొని ఇంకా సమయమంతా గణితం, సైన్స్ బోధనపై దృష్టి పెట్టడం వలన ప్రవేశ పరీక్షలలో రాణిస్తున్నారు. ఒత్తిడి లేని, స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య ఒక్క ప్రభుత్వ రంగంలోనే లభిస్తుంది. కనుక కీలకమైన ఇంటర్మీడియట్ విద్యలో విద్యార్థిని తమ భవిష్యత్ లక్ష్యాల వైపు మళ్ళించే శాస్త్రీయ విద్య తప్పనిసరిగా అవసరం అవుతుంది. తాము ఇంటర్మీడియట్ స్థాయిలో నేర్చుకునే విద్య జీవితానుభవంలో ఉపయోగపడేది. తమ ఉపాధి అవకాశాలు కల్పించేదిగా, కనీసం పెంచేదిగా ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచనలు ఉండాలని, ఇంటర్ విద్యలో గౌరవప్రదమైన సంస్కరణలు రావాలని కోరుకుందాం. ఇంటర్ చదువుత్రిశంకు స్వర్గంలా కాకుండా విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే సంపూర్ణ అనుభవాలు, నైపుణ్యాలు నేర్పేదిగా, తీర్చిదిద్దేది గా ఆ మార్పులు ఉండాలని కోరుకుందాం

ఎన్.తిర్మల్ 94418 64514

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News