Wednesday, January 22, 2025

మార్చి 15నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు నిర్వహించే తేదీలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. 2023 మార్చి 15 నుంచి ప్రథమ సంవత్సరం, 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. రోజు కు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మార్చి 4న నైతికత, మానవ విలువలు(ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూ స్)పరీక్ష, మార్చి 12న పర్యావరణ విద్య(ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్ష ఉంటుం ది. ఈ షెడ్యూల్ ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తుందని బోర్డు తెలిపింది.

Inter exams from March 15

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News