Monday, April 7, 2025

మే 6 నుంచి ఇంటర్… మే 23 నుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Inter exams from May 6 to 23

మన : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మరోసారి సవరించింది. జెఇఇ మెయిన్ పరీక్షల తేదీలను మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు బుధవారం సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం మే 6 నుం చి 23 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వర కు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. జెఇఇ మెయిన్ పరీక్షల తేదీలను మార్చి, ఏప్రిల్ 21 నుంచి మే 4 వర కు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎ) ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సవరించింది. అలాగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ప్రభుత్వ పరీక్షల వి భాగం ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను సవరించింది. మే 23 నుంచి జూన్ 1 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News