Wednesday, January 22, 2025

మార్చి 15 నుంచి ఎపిలో ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఎపి ఇంటర్‌బోర్డు సోమవారం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 22న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 24న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News