Thursday, January 23, 2025

లవ్‌జిహాద్ భయాలతో.. ముంబై జంట రిసెప్షన్‌కు ఆటంకం

- Advertisement -
- Advertisement -

 

ముంబై : స్థానికంగా దివ్య ఇమ్రాన్‌ల వివాహ అనంతర వేడుక కార్యక్రమానికి లవ్ జిహాద్‌తో బ్రేక్ పడింది. ముంబైలో ఉండే హిందూ యువతి దివ్య, ముస్లిం యువకుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆదివారం వీరి పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. ఇందుకు సన్నిహితులకు పలువురికి ఆహ్వాన పత్రాలు కూడా పంపించారు. అయితే ఇటీవలే ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ అనే యువకుడు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో లవ్ జిహాదీ ఉదంతం తలెత్తింది.

దివ్య ఇమ్రాన్‌ల విషయంలోనూ లవ్ జిహాద్ నీలినీడలు పర్చుకునే వీలుందని స్థానిక న్యూస్ ఛానల్ ఎడిటర్ ఒకరు శనివారం ఉదయం ట్వీటు వెలువరించారు. ఈ కొత్త జంట రిసెప్షన్ ఆహ్వాన పత్రికను వాకర్ హత్య కేసును జత చేస్తూ ట్వీటు వెలువరించారు. లవ్ జిహాద్‌తో ముడివడి ఉండే టెర్రరిస్టు చర్యలు అనే శీర్షికతో ట్వీటు పెట్టడంతో వాసాయ్ వెస్ట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన వేడుకను అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు హుటాహుటిన నిలిపివేశారు. రిసెప్షన్‌ను ఆపివేస్తున్నామని స్థానిక పోలీసులకు తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News