Friday, November 22, 2024

సెప్టెంబర్-అక్టోబర్‌లలో ఫస్టియర్ పరీక్షలు?

- Advertisement -
- Advertisement -
Inter first year exams in September or October
వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం
ఎగ్జామ్స్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరపాలని ప్రతిపాదన
ప్రభుత్వానికి పంపించిన ఇంటర్ బోర్డు
మొదటి సంవత్సరం పరీక్షలకు ఫీజులు చెల్లించిన వారు 4.59లక్షలు
కొవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేసి ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన బోర్డు, ప్రభుత్వం అనుమతి రాగానే పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మే రకు ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిపించింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షె డ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. క రోనా ప్రభావం కొంత తగ్గడంతో సెప్టెంబర్ 1 ను ంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ప్రథ మ సంవత్సరం పరీక్షలను నిర్వహించేందుకు ఇం టర్ బోర్డు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గత విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,59,008 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.

కరోనా కారణంగా మొదటి ఏడాది విద్యార్థులంతా ప్రమోట్

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వే సింది. జూన్ నెలలోనూ కొవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో, ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చే యగా, మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమో ట్ చేశారు. సెకండియర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా మార్కులు కేటాయించారు. కానీ ప్రథమ సంవత్సరం పరీక్షలపై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. దాంతో మొదటి సంవత్సరం పరీక్షలు రాయకుండానే విద్యార్థులు రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం కొంత తగ్గడంతో వీరికి పరీక్షలు లేకుండా పాస్ చేయడం కంటే పరీక్షలకు నిర్వహించడమే మేలని విద్యాశాఖ భావిస్తోంది. పరీక్షలకు నిర్వహించకపోతే ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతారని, వారికి అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గత ఏడాది ప్రథమ సంవత్సరం ఫీజు చెల్లించిన విద్యార్థులు 4.59 లక్షల మంది ఉంటారు. వీరికి ఇప్పటికే హాల్‌టికెట్లు సిద్ధం చేయగా, పశ్నపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి రెండు వారాల సమయం ఇచ్చి టైం బేబుల్ ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది.

పరీక్షలు రాసేందుకే విద్యార్థుల మొగ్గు

ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరీక్షలు లేకుండా కనీస మార్కులతో పాస్ చేసినా తమ ఎలాంటి ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలకు ఇంటర్ మార్కులే కీలకం ఉంటున్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఒక్కో సబ్జెక్టులో 80,90 మార్కులు వచ్చినా సంతృప్తి చెందకుండా మళ్లీ ఇంప్రూమెంట్ రాసిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంటర్‌లో కనీసం మూడు నాలుగు సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు వస్తే తప్పా విద్యార్థులు సంతృప్తి చెందడం లేదు. ఒకవేళ పరీక్షలు రాయని వారిని పాస్ చేస్తామని ప్రకటించినా గత ఏడాది పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 90 నుంచి 95 శాతం వరకు పరీక్షలు రాసేందుకే సిద్ధపడే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News