Tuesday, December 24, 2024

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల దృష్ట్యా 040 24600110,ఇమెయిల్: helpdesk.. ie@telangana.gov ఇంటర్ బోర్డు కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూం పనిచేస్తుందని, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి ఫోన్ లేదా ఇమెయిల్ చేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News