Sunday, February 2, 2025

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం మొదటి సారి సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంటోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షించనున్నారు.

ప్రాక్టికల్ మార్కులూ కీలకమే
రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయకుండానే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రాక్టికల్స్‌లో ఫుల్ మార్కులు వేయించొచ్చులే అన్న ధీమా ప్రైవేట్ కళాశాలలు నామమాత్రంగానే ప్రయోగాలు నిర్వహించి, తమ విద్యార్థులకు ఫుల్ మార్కులు వేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో తొలిసారి రాష్ట్రంలో సిసి కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో పూర్తి మార్కులు వస్తాయా..? లేదా..? అనేది చూడాలి. ఇంటర్ సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. అయితే విద్యార్థులు వందకు వంద మార్కులు వస్తే తప్ప సంతృప్తి చెందడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వందకు వంద మార్కులు రావడంలో ప్రాక్టికల్ మార్కులు కీలకంగా మారనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News