Monday, December 23, 2024

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు కీలకంగా మారుతున్నాయి.

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఇదివరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజితోపాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు వస్తేనే జెఇఇకి అర్హత నిబంధన ఉండేది. అయితే కొవిడ్ కారణంగా ఈ నిబంధనలను ప్రభుత్వాలు ఎత్తివేశాయి. ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News