Sunday, April 20, 2025

22న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీన ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకే సారి విడుదల చేయనున్నారు. గత నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు tgbie.cgg.gov.in వెబ్‌సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకో గా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థు లు 4,40,788 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించడం విశేషం. ఇంటర్ పరీక్షలలో ఈసారి విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ పిరియడ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News