Friday, December 20, 2024

ఉత్తమ జిమ్నాస్ట్‌గా సోనాక్షి

- Advertisement -
- Advertisement -

ముగిసిన ఇంటర్ స్కూల్ జిమ్నాస్టిక్స్ పోటీలు

సమన తెలంగాణ/హైదరాబాద్: అంతర్ పాఠశాల జిమ్నాస్టిక్స్ పోటీల్లో సోనాక్షి పట్నం ఉత్తమ జిమ్నాస్ట్‌గా నిలిచింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆయా పాఠశాలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఇందులో సోనాక్షి పట్నం ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మీరా రెడ్డి, సోనాక్షి, థియా బోపన్న, ఆదిత్య, ధనిక లాల్వాణి, వియాంశ్, ఆధ్యా రెడ్డి, కసవరి, మోహిద్ అజానీ, దీక్ష, సాయి అంకిత్, విద్య, కార్తీక్, ధీర్తి రెడ్డి, క్రోధ్ వీర్ తదితరులు స్వర్ణాలు సాధించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో లీపింగ్ ఫ్రాగ్స్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రోషిణి రాయి చందాని విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News