Monday, January 20, 2025

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎపి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించడంతో పాటు వారికి రూ.25 వేల రివార్డును ప్రకటించారు. ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అసాంఘీక కార్యకలాపాల నిర్మూలనే లక్షంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ముందుకు సాగుతోంది.

అందులో భాగంగా అనంతపురం ఎస్‌పి డా. ఫక్కీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్’ బళ్ళారి అనంతపురం కేంద్రంగా బెంగళూరుకు చెందిన రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంతకాలంగా కొనసాగిస్తున్న నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ, ఆయుధాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించి మొత్తం ఆరుగురిని(నలుగురు రౌడీషీటర్లు, తయారీ దారుడు, సరఫరా దారుడు) అరెస్టు చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే నిందితులపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలో కేసులు ఉన్నట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన రౌడీ షీటర్లు జంషీద్ అలియాస్ ఖాన్, ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ అలియాస్ రియాజ్ షేక్‌లు మహారాష్ట్రలోని సిర్పూర్ న ఉండి గంజాయి, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాల నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాలపై దాడులు చేసి ఆయుధాల తయారీదారుడు, డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ రాజ్‌పాల్ సింగ్ తో పాటు ఆయుధాల సరఫరా దారుడు సుతార్‌ను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News