Thursday, December 12, 2024

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి కిరణ్ ఖరే తెలిపారు. జిల్లా పోలీసు కార్యాయలంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 17.3 తులా బంగారు ఆభరణాలు, 83 తులాల వెండి, ఆరు బైక్‌లు, ఒక ఎల్‌ఈడి టివి, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి మొత్తం విలువ రూ.20,05,000 ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా, గాంధీనగర్‌కు చెందిన తాటికొండ స్వామి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాని గ్రామానికి చెందిన కురాసేనగా ఈశ్వర్, మహారాష్ట్రలోని సిరోంచ, గడ్చిరోలి గ్రామానికి చెందిన వ్యక్తులు అంతర్‌రాష్ట్ర దొంగలుగా చెలమణి అవుతున్నారని అన్నారు.

కాటారం మండలం, శంకరంపల్లి గ్రామంలో అక్టోబర్ 27న రాత్రి సమయంలో దొంగతనం జరుగగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి డిఎస్‌పి రామ్మోహన్‌రెడ్డి, సిఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో మూడు టీమ్‌లుగా ఏర్పడి విచారణ కొనసాగించగా గంగారం ఎక్స్ రోడ్డు వద్ద గల సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తింనట్లు తెలిపారు. చంద్రాపూర్ దగ్గర రాజురా, ఘణపురం మండలంలోని చెల్పూర్, కొయ్యర్, హన్మకొండ సుబేదారి, మంథనిలోని గుంజమడుగు, పస్రా, కాటారం పోలిస్‌స్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, మోటార్ సైకిళ్లను రాత్రిపూట దొంగలించేవారని తెలిపారు. దొంగలించిన సొత్తును అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని అన్నారు. కాటారం మండలం, శంరంపల్లిలో దొంగతనం చేసి.. కాటారం సిఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్, మద్దులపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారని తెలిపారు. వీరిని విచారించగా దొంగతనం చేసినట్లు తెలిపారు.

నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకమని, ప్రజలు కెమెరాల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు. ఈ కేసు ఛేదించిన డిఎస్‌పి రామ్మోహన్‌రెడ్డి, సిఐ నాగార్జునరావు, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కాటారం ఎస్‌ఐ అభినవ్, అడివి ముత్తారం ఎస్‌ఐ మహేందర్, క్లూస్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, సిబ్బంది శ్రీను, లక్ష్మీరాజ్, హరి, హరీశ్, ప్రసాద్, జగన్, లవన్, ఐటి కోర్ వేణు, హోంగార్డులు తిరుపతి, రాజయ్య, ఐటి కారు వేణు, రాజయ్యలను అభినందించి నగదు బహుమతి అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News