Friday, November 22, 2024

యాజమాన్యం వేధింపులు.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గద్వాల్ టౌన్ : గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య పాల్పడినట్లు గద్వాల్ టౌన్ ఎస్‌ఐ అబ్దుల్ షుకూర్ తెలిపారు. తల్లిదండ్రులు కథనం మేరకు.. ధరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన మల్లేష్ కుమారుడు వెంకటేష్ (17) గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం గద్వాల పట్టణంలోని నివసిస్తున్న రూమ్‌లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్ని ఆత్మహత్యకు యత్నించగా.. అదే సమయంలో తోటి స్నేహితులు రూమ్‌లోకి రాగ, అపస్మారకస్థితిలో ఉన్న విద్యార్థిని చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యుఐ, యుఎస్‌ఎఫ్‌ఐ, పీడీయస్‌యు, ఏబీవీపీ, తదితర విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం గద్వాల పట్టణంలోని ఆ కళాశాల వద్ద ఆందోళనకు దిగ్గారు. కళాశాల యాజమాన్యం వేధింపులే వెంకటేష్ మృతి కారణమంటూ.. విద్యార్థిని కాలేజ్ యాజమాన్యం అకారణంగా దూషించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరం మృతి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న గద్వాల డిఎస్‌పి రంగస్వామి, గద్వాల టౌన్ ఎస్‌ఐ అబ్దుల్ షుకూర్, మల్దకల్ ఎస్‌ఐ ఆర్.శేఖర్ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కబెట్టారు.
యాజమాన్యం వేధింపులే కారణమా..?
కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌ఎస్‌యుఐ,యుఎస్‌ఎఫ్‌ఐ, పీడీయస్‌యు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గత కొంతకాలంగా యాజమాన్యం విద్యార్థులను ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించకపోతే ఇంటర్ పరీక్షల ఫీజు తీసుకోమని ఖరాకండిగా చెప్పడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థులు ఆందోళనకు గురైనట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. యాజమాన్యం ఒత్తిడి తట్టులేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News