- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువున్న విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకొని ప్రాణాలు కోల్పోయాడు. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. వీరిలో ఓవర్‌డోస్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే సాహిల్ అనే వ్యక్తి ఈ విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. సాహిల్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -