Friday, January 10, 2025

నల్లగొండలో విషాదం.. ఉరివేసుకుని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Inter Student dies after hangs herself in Nalgonda

నల్లగొండ: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నల్గొండ మండలం పరిధిలోని శేషమ్మగూడెంలో ఇంటర్‌ విద్యార్థిని దోరెపల్లి ప్రత్యూష(18) బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, శేషమ్మగూడెంకు చెందిన ఓ యువకుడు కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధించడంతోనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Inter Student dies after hangs herself in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News