- Advertisement -
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష రాస్తూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్(16) పాతపట్నంలోని మహేంద్ర జూనియర్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదుతున్నాడు. బుధవారం కెమిస్ట్రీ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాంతులు చేసుకుని సృహ కోల్పోయాడు. గమనించిన సిబ్బంది తక్షణమే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి మరణించినట్టు డాక్టర్లు ద్రవీకరించారు. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
- Advertisement -